తొమ్మిది మంది కొత్తవారికి కేబినెట్ లో చోటు

రేపు జరిగే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కనున్న తొమ్మిది మంది కొత్తవారి పేర్లు వెల్లడయ్యాయి. నూతన మంత్రులుగా హర్ దీప్ సింగ్ పురి, గజేంద్ర సింగ్ షెకావత్, సత్యపాల్ సింగ్, అల్పాన్స్ కన్నంథనమ్, అశ్వినీకుమార్ చౌబే, శివ్ ప్రతాప్ శుక్లా, వీరేంద్ర కుమార్, అనంత్ కుమార్ హెగ్డే, రాజ్ కుమార్ సింగ్ రేపు ఉదయం పదిన్నరకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

హర్‌దీప్‌ సింగ్‌ పురి 1974 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కాగా.. గజేంద్రసింగ్‌ షెకావత్ రాజస్థాన్ నుంచి ఎంపీగా ఉన్నారు. ముంబై పోలీస్ కమిషనర్ గా పని చేసిన సత్యపాల్ సింగ్ కు కూడా కేబినెట్ లో చోటు దక్కింది. కేరళ నుంచి 1979 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అల్ఫాన్స్‌ కన్నంథనమ్, బీహార్ నుంచి ఎంపీ అశ్వినీ కుమార్ చౌబే, రాజ్ కుమార్ సింగ్, యూపీ నుంచి రాజ్యసభ ఎంపీ శివ ప్రతాప్ శుక్లా, మధ్యప్రదేశ్ నుంచి ఎంపీ వీరేంద్ర కుమార్, కర్నాటక నుంచి అనంత్ కుమార్ హెగ్డేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అల్ఫాన్స్‌, హర్‌దీప్‌ సింగ్‌ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యులుగా లేరు.