తెలంగాణ వైద్య, ఆరోగ్య పథకాలు అద్భుతం

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్యారోగ్య పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు బీహార్‌ హెల్త్‌ మినిస్టర్‌ మంగల్‌ పాండే. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న వివిధ ప‌థ‌కాల‌ను ప‌రిశీలించ‌డానికి హైదరాబాద్‌కు వ‌చ్చిన పాండేకు వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రణాళికలు, అమలు చేస్తున్న వివిధ పథకాల, కేసీఆర్ కిట్స్ పథకం అమలు, నిధులు, విధులు వంటి అంశాలను వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ పథకాలను అభినందించినప ఆయన.. ముఖ్యంగా పిల్లలు, గర్బిణీల కోసం ప్రవేశపెట్టిన పథకాలు , ముఖ్యంగా కేసీఆర్‌ కిట్స్‌ పథకం భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ పథకాలను బీహార్‌ లో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.