తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్రం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌. కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలను  ఐడీసీ చైర్మెన్ ఈద శంకర్ రెడ్డి కలిసి ఆయన ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సైకిల్‌ తొక్కారు. అండర్ 14, 16, 18 బాల బాలికల విభాల్లో జరగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇందులో గెలుపొందిన వారిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.