తెలంగాణలోనే ఉచితంగా చేపపిల్లల పంపిణీ

దేశంలోనే మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నల్లచెరువులో ఆయన చేపపిల్లలను వదిలారు. గంగపుత్రుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి మత్స్యకారులు సొంతంగా చేపలను అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పోచారం చెప్పారు.