తిమ్మాయిపల్లిని సందర్శించిన విదేశీయులు

బాలవికాస సంస్థ దత్తత తీసుకున్న సిద్దిపేట జిల్లా తిమ్మాయిపల్లి గ్రామాన్ని పలువురు విదేశీయులు సందర్శించారు. తిమ్మాయిపల్లిలో వాడవాడలా తిరుగుతూ అభివృద్ధిని పరిశీలించారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు, వివిధ కమిటీలు ఏ విధంగా భాగస్వామ్యం అవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విదేశీయులకు, బాలవికాస సంస్థ సభ్యులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో కలిసి బోనాలు ఎత్తుకున్నారు. అంతేకాకుండా బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.