తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరునెల్వేలిలో వేగంగా వచ్చిన లారీ.. ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.