తప్పుడు కేసు పెట్టారంటూ ఓ వ్యక్తి వినూత్ననిరసన

తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలియజేశాడు. తన తల్లిదండ్రులను 40 కిలోమీటర్ల దూరం మోసి … తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఒడిశాలోని మయూర్ భంజ్ కు చెందిన ఓ గిరిజనుడిపై  పోలీసులు 2009 లో  కేసు నమోదు చేశారు. 18 రోజుల పాటు జైల్లో ఉంచారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా ఆ కేసు వెంటాడుతోంది. దీంతో విసిగిపోయిన అతను తన నిరసనను తెలియజేశాడు. తన తల్లిదండ్రులను 40 కిలోమీటర్ల దూరంలోని కోర్టుకు మోసుకెళ్లాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.