ఢిల్లీలో వైభవంగా దసరా ఉత్సవాలు

ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రామలక్ష్మణ వేషధారులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన రామ్ లీల ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.