ఢిల్లీలో చెత్తకుప్ప బీభత్సం

ఢిల్లీలోని ఘాజీపూర్‌ లో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన భారీగా పెరిగిపోయిన చెత్త కుప్ప ఒక్కసారిగా కూలింది. ఇదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై చెత్త పడిపోయింది. దీంతో కొన్ని వాహనాలు అందులో చిక్కుకుపోయాయి. చెత్తకుప్ప ఒక్కసారిగా పడిపోవటంతో కొన్ని వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో  పడ్డాయి. దాదాపు ఆరు వాహనాలు కాలువలో పడిపోవటంతో ఇద్దరు చనిపోయారు. కొంతమందికి గాయాలు అయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.