డేరాబాబా సొంత నాణేలు

హర్యానా రాష్ట్రంలోని సిర్సాలో ఉన్న డేరా సచ్ఛా సౌదా హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు జరుపుతున్నతనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. డేరా లోపల ఉంటున్న ప్రజలకు ప్రత్యేక ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఒక్క రూపాయి నుంచి వంద రూపాయల వరకు ప్రత్యేక కాయిన్స్ ద్వారా వస్తు కొనుగోళ్లు జరిగేవని అధికారులు గుర్తించారు. గుర్మీత్ కు సంబంధించిన పలు హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. త్వరలోనే రూర్కీ నుంచి ఫోరెన్సిక్ అధికారులు వచ్చి… డేరాలో మరిన్ని తనిఖీలు చేపట్టనున్నారు. మరోవైపు, డేరాలో కొన్నిఅస్ధిపంజరాలు బయటపడ్డట్లు వార్తలు వస్తున్నప్పటికీ… వాటిని పోలీసులు ధృవీకరించలేదు. తనిఖీల నేపథ్యంలో సిర్సాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.