డిప్యూటీ ఈఈ ఇళ్లపై ఏసీబీ దాడులు

పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఈఈ సుదర్శన్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో… మహబూబ్ నగర్, హైదరాబాద్ లోని 7 ప్రాంతాల్లో సోదాలు చేశారు. 3 కోట్ల రూపాయలకు పైగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించారు. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్నారు.