టెస్ట్ కెరీర్‌కు డుమిని వీడ్కోలు

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జేపీ డుమిని తన టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన నిర్ణయం వెంటనే అమల్లోకి రానుందన్న డుమిని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం ఆడుతానని ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా ఒక ప్రకటనలో ధృవీకరించింది. దేశం తరఫున 46 టెస్ట్‌ల్లో ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది. ఇన్నేండ్లు నాకు మద్దతుగా నిలిచిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. రానున్న భవిష్యత్తులో పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాను అని డుమిని అన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన కొనసాగించడంతో 33 ఏండ్ల డుమినిని జట్టునుంచి తప్పించారు.