టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్

ఆస్ట్రేలియాతో ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇద్ద‌రు స్పిన్న‌ర్లు, ఇద్దరు పేస్ బౌల‌ర్ల‌తో భార‌త్ బ‌రిలోకి దిగుతున్న‌ది. ర‌హానే ఓపెన‌ర్‌గా దిగ‌నున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో టీమ్‌లోకి వ‌చ్చిన జ‌డేజాకు తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు.