టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న భారత్

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా ర్యాంకు పతనమైంది. టెస్ట్‌ సిరీస్‌లో శ్రీలంకను 3-0తో వైట్‌ వాష్‌ చేసిన టీమిండియా ఖాతాలో 125 పాయింట్లు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన తాజా ర్యాంకిం గ్స్‌లో ఆసీస్‌ ఒక స్థానం దిగజారి ఐదో ర్యాంక్‌లో నిలిచింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను కంగారూ జట్టు 1-1తో డ్రా చేసుకుంది. న్యూజిలాండ్‌ స్వల్ప తేడాతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. అయితే ఆసీస్‌పై ఒక టెస్ట్‌ నెగ్గి 5 పాయింట్లు సాధించినా బంగ్లాదేశ్‌ మాత్రం 9వ స్థానంలోనే కొనసాగుతోంది.