జై ల‌వ‌కుశ పాట‌లు విడుదల

ఎన్టీఆర్ తొలిసారి మూడు విభిన్న పాత్ర‌ల‌లో న‌టించిన‌ చిత్రం జై ల‌వ‌కుశ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. తాజాగా దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన బాణీల‌ను విడుద‌ల చేశారు. ఇక అభిమానుల కోసం సెప్టెంబ‌ర్ 10న చిత్ర బృందం హైద‌రాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఆ రోజు చిత్ర ట్రైల‌ర్ కూడా విడుద‌ల కానుంది. ఈ మూవీ లో జై, ల‌వ‌, కుశ అనే పాత్ర‌ల‌లో ఎన్టీఆర్ కనిపించ‌నుండగా.. ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు.