‘జై లవకుశ’ లో తమన్నా హాట్ లుక్!

మిల్కీ బ్యూటీ తమన్నా జై లవకుశలో తన అందాలను ఆరబోస్తున్నది. ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ లో మెరిసిపోతున్నది. ఐటెం సాంగ్ ఇంకా రిలీజ్ చేయకపోవడంతో, అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తున్నట్ చిత్ర యూనిట్ తెలిపారు. . అయితే ఈ లోగానే ఈ సాంగ్ కి సంబంధించి తమన్నా హాట్ లుక్ ను రిలీజ్ చేశారు.  ”స్వింగు జరా .. ” అంటూ ఈ స్పెషల్ సాంగ్ సాగుతుందని అంటున్నారు.  పోస్టర్ చూస్తే తమన్నా ఒక రేంజ్ లో అందాలు ఆరబోసినట్టు అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్స్ లో ఈ సాంగ్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ తో కలిసి కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో అలరించిందో .. అంతకుమించి అనేలా ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.