జైలుకెళ్లేది నేను కాదు.. పళనిస్వామి!

తమిళనాడు సీఎం పళనిస్వామి జైలుకు వెళ్లటం ఖాయమని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ అన్నారు. త్వరలోనే జైలుకు వెళ్లేది తాను కాదని పళనిస్వామియేనని చెప్పారు. సీఎం పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ మొదలుపెడితే చిప్పకూడు తప్పదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం తనకు లేదన్నారు. అసెంబ్లీలో బలపరీక్ష పెడితే పళనిస్వామికి ఎంత మంది మద్దతిస్తున్నారో తేలిపోతుందన్నారు దినకరన్.