జూరాలకు పోటెత్తిన వరద

జూరాలకు వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల నుంచి లక్షా పన్నెండు వేల నాలుగొందల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తేశారు. అప్పర్ జూరాలలో ఐదు యూనిట్లు, లోయర్ జూరాల లో ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిననీరు వచ్చినట్లు కిందకు వదిలేస్తున్నారు.