జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రో ధరలు తగ్గుతాయి

పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు గణనీయంగా తగ్గుతాయన్నారు. అయితే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువచ్చే అధికారం తమకు లేదని, ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. అమెరికా తీర ప్రాంతాలను ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేయడం వల్లనే.. ఇటీవల పెట్రో ఉత్పత్తుల ధరల్లో గణనీయంగా మార్పులు వచ్చాయన్నారు.