జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జీఎస్టీ 21వ మండలి సమావేశం  ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ర్టం తరపున ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ప్రజా ఉపయోగ పనులపై భారం తగ్గించాలని రాష్ర్ట ప్రభుత్వం కోరనుంది. జీఎస్టీ భారంపై ఇప్పటికే సమగ్ర నివేదిక సిద్ధం చేశారు అధికారులు. 12 శాతం పన్ను విధింపుతో రూ. 12 కోట్ల వరకు భారం పడవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. కేంద్రం వద్ద ఉన్న రూ. 30 వేల కోట్లకు పైగా ఐజీఎస్టీ వాటాపై చర్చించే అవకాశం ఉంది.