జాతి భవిష్యత్తు కోసమే మహిళలకు ఉపాధి అవకాశాలు

జాతి భవిష్యత్తు కోసమే మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌ విద్యానగర్‌లో రీజినల్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ కు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఉప రాష్ట్రపతి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి. స్కిల్‌ డెవలప్‌ మెంట్ సెంటర్‌ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, కేంద్రమంత్రి దర్మేంద్ర ప్రదాన్‌ తదితరులు పాల్గొన్నారు.