జవాన్ల త్యాగాలను ప్రశంసించిన రాజ్ నాథ్

జమ్ము కశ్మీర్‌లో గతంతో పోల్చుకుంటే పరిస్థితి ఎంతో మెరుగైందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. జమ్ము కశ్మీర్ లో పర్యటిస్తున్న ఆయన జవాన్లు, పోలీసుల త్యాగాలను ప్రశంసించారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మీరు మీ విధులను నిర్వర్తిస్తున్నారు. మీ ధైర్య సాహసాలను కొనియాడేందుకు మాటలు రావడం లేదని చెప్పారు. కశ్మీర్ లో సమస్యలను పరిష్కరించేందు ప్రధాని మోడీ పలు సూచనలు చేశారన్నారు రాజ్‌నాథ్‌. త్వరలోనే పోలీసుల కోసం బుల్లెట్ ఫ్రూప్‌ వాహనాలు కొనుగోలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో భద్రతకు సంబంధించి సి.ఆర్.పి.ఎఫ్ బలగాలతోనూ రాజ్‌నాథ్ చర్చించారు.