జల్సాల కోసం కన్నకొడుకునే అమ్ముకున్న తాగుబోతు

జల్సాల కోసం కన్నకొడుకునే అమ్ముకున్నాడు తాగుబోతు వ్యక్తి. 11 నెలల కొడుకును అమ్ముకొని కొత్త ఫోన్, భార్యకు చీర, బిడ్డకు వెండి కడియంతో పాటూ పీకల దాకా మద్యం తాగి ఎంజాయ్ చేశాడు.   ఒడిషాలోని భద్రక్ జిల్లాలో ఘటన చోటు చేసుకుందిస్థానికంగా స్వీపర్ గా పని చేసే బలరాం..మద్యానికి బానిసయ్యాడు. దీంతో తాగుడు కోసం నిత్యం ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకునే వాడు. క్రమంలోనే తన 11 నెలల కొడుకును మాజీ ప్రభుత్వ ఉద్యోగికి అమ్మాడు. వచ్చిన డబ్బులో రెండు వేలు పెట్టి కొత్త ఫోన్, 15వందలు పెట్టి కూతురికి వెండి కడియం, భార్యకు ఒక చీర కొన్నాడు. మిగిలిన డబ్బులతో ఫుల్లుగా మందు తాగాడు. అయితే భర్త నిర్వాకంపై బలరాం భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో….అతనితో పాటూ బాబును కొన్న వ్యక్తికి కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసులో మరో ముగ్గురికి కూడా అరెస్ట్ చేశారు.