జలదిగ్బంధంలో ఉప్పల్

హైదరాబాద్ ఉప్పల్ లో భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్వరూప్ నగర్, ద్వారక నగర్, రాఘవేంద్ర కాలనీతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వరద ఉదృతితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.