జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగం

జమ్మూ కశ్మీర్‌ లో భారత్‌ లో అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ (ఓఐసీ) ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. కశ్మీర్‌ విషయంలో ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఓఐసీ వ్యాఖ్యలు ఉన్నాయని భారత్‌ విమర్శించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అటు ఓఐసీ, పాకిస్తాన్‌ కు సైతం సూటిగా సమాధానమిచ్చింది. కశ్మీర్‌ భారత్‌ లో అంతర్భాగం.. మా దేశానికి సంబంధించిన అంతర్గత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. తమ జోలికి వస్తే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించింది.