జపాన్ ప్రధానికి పీఎం మోడీ ఘన స్వాగతం

జపాన్ ప్రధాని షింజో అబే భారత్‌ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భార్యతో కలిసి విచ్చేశారు. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం కోసం ఆయన ముందుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దిగారు. ప్రోటోకాల్‌ ను పక్కన బెట్టి స్వయంగా ప్రధాని మోడీ ఆయనకు స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లోనే పలు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం జపాన్ ప్రధాని దంపతులు, ప్రధాని మోడీ కలిసి రోడ్‌ షో గా సబర్మతి ఆశ్రమానికి బయలుదేరనున్నారు. దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఈ రోడ్‌ షో సాగనుంది. ఓ విదేశీ నేత భారత్‌ లో ఇలా రోడ్ షో లో పాల్గొనటం ఇదే మొదటిసారి.