చైనాకు బయల్దేరిన ప్రధాని మోడీ

బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చైనా బయల్దేరారు. ఉదయం మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం పూర్తయ్యాక.. కొత్త మంత్రులతో సమావేశమైన అనంతరం మోడీ.. చైనా బయల్దేరి వెళ్లారు. బ్రిక్స్‌ సదస్సులో ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలపై మోడీ మాట్లాడే అవకాశం ఉంది. బ్రిక్స్‌ సదస్సు నుంచి ఫలవంతమైన, సానుకూల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. గోవా బ్రిక్స్‌ సదస్సుద్వారా సాధించిన ఫలితాల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సైతం ఆయన అందులో చెప్పారు. బ్రిక్స్‌ సదస్సు అనంతరం ఆయా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించే అవకాశం ఉంది. అనంతరం మయన్మార్ పర్యటనకు వెళ్తారు. మొత్తం ఐదు రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన కొనసాగనుంది.