చెన్నై మెరీనా బీచ్ లో ఉద్రిక్తత

చెన్నైలోని మెరినా బీచ్ లో ఉద్రిక్తత నెలకొంది. అన్నాదురై జయంతి వేడుకల సందర్భంగా దినకరన్, దీప వర్గాల మధ్య తోపులాట నెలకొంది. అన్నాదురై  స్మారకం వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన దినకరన్ ను జయ మేనకోడలు దీప వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో  మెరీనా బీచ్ లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.