చాందిని స్నేహితుడే హంతకుడు

ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె స్నేహితుడినే హంతకుడిగా గుర్తించారు. చాందినికి స్కూల్ మేట్  సాయికిరణ్ రెడ్డి తో ఫ్రెండ్ షిప్ ఉంది. ఇది ప్రేమకు దారి తీసింది. అయితే పెళ్లి చేసుకోవాలని మృతురాలు .. సాయికిరణ్ పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే  అడ్డు తొలగించుకునేందుకు ఆమెను అమీన్ పూర్ గుట్టుల్లోకి  తీసుకెళ్లినట్టు సమాచారం. అక్కడే చాందినిని దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.