ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి

కర్ణాటకలోని ఎల్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.