ఘనంగా ఫిదా 50 డేస్ వేడుకలు

అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య సాగే అంద‌మైన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఫిదా. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ అర్ధ‌శ‌త‌దినోత్సవ సంబ‌రాలు జ‌రుపుకున్నారు. సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్స్, ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. జూలై 21న విడుద‌లైన ఈ చిత్రం అన్ని సెంట‌ర్ల‌లోను బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఓవ‌ర్సీస్ లోను ఫిదాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ చిత్రంలో అమెరికా అబ్బాయిగా వ‌రుణ్ తేజ్ త‌న న‌ట‌న‌తో అద‌రగొట్ట‌గా, తెలంగాణ అమ్మాయిగా భానుమతి పాత్రలో సాయిపల్లవి ఆడియెన్స్ ని ఫిదా చేసింది.