ఘనంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి జోగు రామన్న తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంతో రాష్ట్రంలో 29కోట్లకు పైగా మొక్కలు నాటామని చెప్పారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరులకు మంత్రి జోగు రామన్న … ఘన నివాళలు అర్పించారు. అటవీ శాఖను మరింత బలోపేతం చేసేందుకు ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నట్లు మంత్రి జోగు తెలిపారు. నెహ్రూ జూపార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.