గ్రనేడ్ దాడిలో ఒకరి మృతి, 14 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్ లో సంఘ విద్రోహ శక్తుల దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీనగర్ లోని జహంగీర్ చౌక్ సీఆర్పీఎఫ్ చెక్ పోస్టు దగ్గర జరిగిన గ్రనేడ్ దాడిలో ఒకరు చనిపోగా, 14 మంది గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్‌ పైకి హ్యాండ్ గ్రనేడ్‌ విసిరారు. ఐతే, అది విసిరిన వ్యక్తి సమీపంలోనే పేలడంతో అతను గాయపడ్డాడు. జనసమ్మర్థం గల రోడ్డు కావడంతో స్థానికులు కూడా ఎక్కువమంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలించారు.