గోరఖ్‌పూర్ ఘటనలో డాక్టర్ కఫీల్‌ అరెస్ట్

ఉత్తర ప్రదేశ్ లో బాబా రాఘవ దాస్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 100 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన ఉదంతంలో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వైద్యుడు కఫీల్‌ ఖాన్‌ను స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సిలిండర్ల కొరతకు ప్రధాన కారణం కఫీలేనన్న ఆరోపణలు ఉన్నాయి.  మెదడువాపు వ్యాధి విభాగానికి నోడల్ అధికారిగా ఉన్న కఫీల్‌ ఖాన్‌… తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రి కోసం బీఆర్డీ ఆస్పత్రి నుంచే సిలిండర్లను తరలించాడని…ఈ కారణంగానే ఆస్పత్రిలో సిలిండర్ల కొరత ఏర్పడిందని చెబుతున్నారు. కఫీల్ ఖాన్‌ కు కాలేజీ ప్రిన్సిపాల్‌ అయిన డాక్టర్‌ ఆర్కే మిశ్రా కూడా సహకరించాడని విచారణలో తేలింది.