గొర్రెలు, చేపల పెంపకంపై ప్రత్యేక దృష్టి

కష్టపడి సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో ఏ ఒక్కటీ సరిగా జరగలేదని మండిపడ్డారు. అన్ని వర్గాలు నిరాదరణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో మార్పువస్తోందన్నారు. గొర్రెలు, చేపల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. గోదావరి నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.