గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ పై లుక్ అవుట్ నోటీస్

డేరా సచ్ఛా సౌదా గుర్మీత్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పై లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. పంచకుల కోర్టు నుంచి గుర్మీత్ ను తప్పించేందుకు ఆమె ప్రయత్నించినట్లు గుర్తించిన పోలీసులు….ఆమెపై కేసు నమోదు చేశారు.  ఈ నేపథ్యంలో ఆమె విదేశాలకు పారిపోకుండా ఏయిర్ పోర్టులకు సమాచారం అందించారు. పంచకుల కోర్టు నుంచి గుర్మీత్ బయటకు వచ్చిన తర్వాత….అతన్ని అనుచరుల మధ్యకు తీసుకెళ్లి…వాహనంలో రహస్య ప్రదేశానికి తీసుకెళ్లాలని హనిప్రీత్ పథకం రచించింది. కానీ హర్యానా పోలీసులు వారి ప్రయత్నాలను విఫలం చేశారు. ఈ ఘటనలో హనీప్రీత్ తో పాటూ, గుర్మీత్ ప్రధాన అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు. గుర్మీత్ కు శిక్ష ఖరారు అయినప్పటి నుంచి హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.