గిరిజన మహిళా రెసిడెన్షియల్ కాలేజీ ప్రారంభం

రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే టీఆర్ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ప్రైవేటు విద్యాసంస్థలను తలదన్నే విధంగా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలతో పాటు కళాశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో గిరిజన మహిళా డిగ్రీ కాలేజీని ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా  ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక ర్యాంకులను కైవసం చేసుకుంటున్నట్లు తెలిపారు.