గిద్దె పెరుమాండ్ల ఆలయంలో మంత్రి ఈటెల పూజలు

కరీంనగర్ జిల్లాలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని గిద్దె పెరుమాండ్ల ఆలయంలో నిర్వహించిన శమీపూజలో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలని మంత్రి ఈటల అన్నారు. ప్రతి దసరాకు గిద్దె పెరుమాండ్ల ఆలయంలో అధికారికంగా జమ్మి పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగోసారి ఇక్కడ విజయదశమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఈ ఆలయాన్ని అన్ని హంగులతో ఆధునీకరిస్తామని ఈటెల హామీ ఇచ్చారు.