గాంధీలో గవర్నర్ కు ఆపరేషన్

రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. గవర్నర్ కుడి మోకాలి దగ్గర ఉన్న ఆనేకు శస్త్ర చికిత్స కోసం ఆయన గాంధీ వైద్యశాలకు వచ్చారు. వైద్యులు ఎంవీఎన్ రెడ్డి, శుభోద్‌ ఆధ్వర్యంలో 15 నిముషాల పాటు ఆపరేషన్ నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం గవర్నర్ నరసింహన్ రెండు గంటలపాటు ఆసుపత్రిలోనే విశ్రమించారు.