గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటి

రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి, హోంమంత్రి గవర్నర్ కు దసరా శుభాకాంక్షలు చెప్పారు. గవర్నర్ కూడా వారికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.