గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌ లో గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ అనురాగ్‌ శర్మ చెప్పారు. ట్యాంక్ బండ్ మీద 38 భారీ క్రేన్లు సిద్ధంగా ఉంచామన్నారు. రేపు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆయవ మీడియాతో మాట్లాడారు.

శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టంగా భద్రత కల్పించామని డీజీపీ అనురాగ్‌ శర్మ వివరించారు. నిమజ్జనం సాఫీగా జరగడానికి జీహెచ్ఎంసీ, పోలీస్‌ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. నిమజ్జనం జరిగే ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని డీజీపీ వెల్లడించారు.

ముందుగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు కల్పిస్తున్నామని, ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.