‘ఖాకీ’ రియల్ స్టోరీ

కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ధీరన్ అదిగారమ్ ఒండ్రు తెలుగులో ఖాకీ పేరుతో అనువాదమవుతున్నది. ది పవర్ ఆఫ్ పోలీస్ ఉపశీర్షిక. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. వినోద్ దర్శకుడు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్‌గుప్తా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ “2005 సంవత్సరంలో జరిగిన ఓ వాస్తన సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ చిత్ర కథను తయారుచేసుకున్నాడు. పోలీస్ పవరేంటో తెలియజెప్పే చిత్రమిది. సంఘ విద్రోహక శక్తులపై ఒక పోలీస్ అధికారి సాగించిన సమరమేమిటన్నది ఆసక్తికరంగా వుంటుంది. జిబ్రాన్ చక్కటి సంగీతాన్నందించారు. అతి త్వరలో ఆడియోను, చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.