ఖమ్మంలో కాంగ్రెస్ ఖాళీ

స్వరాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు..ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ, రాజకీయ ప్రయోజనాలు లేకున్నా టీఆరెస్ కు జై కొడుతున్నరు జనం. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకత్వం వితండవాదం చేస్తూ జనంలో చులకన అవుతుండటంతో… గ్రామ, మండల స్థాయిలో ఆ పార్టీ ఖాళీ అవుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోనూ ఆదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలు మండలాల్లో కనీసపోటీ ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్.. నేలకొండపల్లి మండలంలో మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పటికే టీడీపీ నామ‌రూపాలు లేకుండా పోయింది. కమ్యూనిస్టుల ఉనికే కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.

పాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ ప్రోత్సహాంతో రికార్డు స్థాయిలో భక్తరామదాసు ఎత్తిపోథల పథకం పూర్తి చేశారు. పాలేరు పాత కాలువను అతి తక్కువ సమయంలో ఆధునీకరించారు. చాలా ఏళ్లుగా భీడుపడిన లక్ష ఎకరాల భూమి ఢోకా లేకుండా సాగులోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు వలసబాటపడ్డారు. నేలకొండపల్లి మండలంలోని కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్య తోపాటు ఆరుగురు సర్పంచ్ లో టీఆర్ఎస్ లో చేరారు. వారితో పాటే ఐదుగురు ఎంపిటీసీలు, పదుల సంఖ్యల మాజీ ఎంపిటీసీలు, మాజీ సర్పంచులు గులాబీ కండుకా కప్పుకున్నారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్  నాయకత్వానికి జై కొడుతున్నరు. కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి తుమ్మల‌ నాగేశ్వరరావు.. ఆ పార్టీకి పుట్టగ‌తులుండ‌వ‌ని హెచ్చరించారు.

మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో టీఆరెస్  మరింత బలపడింది. పీసీసీ సెక్రట‌రిగా ప‌ని చేస్తున్న వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి, పలువురు నాయకులు, కార్యకర్తలతో క‌లిసి టీఆర్ఎస్ లో చేరారు. నేలకొండపల్లి వేదిక మీదే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా మొత్తం బలంగా కనిపిస్తున్న టీఆర్ఎస్ కు పాలేరులో ఎదురులేకుండా పోయింది. చేరికలు కొనసాగుతుండటంతో.. మధిర నియోజికర్గంలోనూ పార్టీ రోజు రోజుకు బలపడుతోంది.

2019 నాటికి పాత ఖమ్మం జిల్లాలోని పదికి పది నియోజకవర్గాలను దక్కించుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్ కు… భారీ వలసలు మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండు ఎంపీల‌తో పాటు ప‌ది అసెంబ్లీలు గెలిపించే బాధ్యత ప్రజల‌దే అన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు టీఆర్ఎస్ శ్రేణులు మ‌రింత ఉత్సాహం నింపింది.