క్యూబాను టార్గెట్ చేసిన ఇర్మా!

క‌రీబియ‌న్ దీవుల‌ను దారుణంగా దెబ్బ‌తీసిన హ‌రికేన్ ఇర్మా ఇప్పుడు క్యూబాపై విరుచుకుప‌డింది. గంట‌ల‌కు 257 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. క్యూబాలోని కైబేరియ‌న్ ప‌ట్ట‌ణానికి 190 కిలోమీట‌ర్ల దూరంలో ఇర్మా కేంద్రీకృత‌మైన‌ట్లు తెలుస్తున్న‌ది. దీంతో అక్క‌డ అత్యంత బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వ‌ర్షాలు పడుతున్నాయి.  మ‌రోవైపు అమెరికాలోని ఫ్లోరిడాపై ఇర్మా ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయి. దీంతో సుమారు 60 ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు  వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఇర్మా వ‌ల్ల క‌రీబియ‌న్ దీవుల్లో సుమారు 20 మంది మృతిచెందిన‌ట్లు సమాచారం.