కేంద్ర మంత్రులుగా 9 మంది ప్రమాణం

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రిమండలిని పునర్‌ వ్యవస్థీకరించారు. కొత్తగా 9 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.  ఉయదం 10.30 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణం  చేయించారు. అశ్వినికుమార్‌ చౌబే, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, శివప్రతాప్‌ శుక్లా, హర్దీప్‌సింగ్‌పూరి, సత్యపాల్‌సింగ్‌, రాజ్‌కుమార్‌సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌తనం, వీరేంద్రకుమార్‌, అనంత్‌కుమార్‌ హెగ్డే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులుగా ప్రమాణం చేసినవారందరికీ కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. వీరిలో హర్దీప్‌సింగ్‌ మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కాగా, సత్యపాల్‌ సింగ్‌ ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌. అల్ఫోన్స్‌ కన్నన్‌తనం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు వీలుగా ఇప్పటికే ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. వచ్చే ఏడాది 4 రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో కూర్పు చేశారు. ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది మూడోసారి.