కేంద్రమంత్రి విచిత్ర వాదన!

పెట్రోల్ ధరలు భారీగా పెరగటంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కేజే ఆల్ఫాన్స్‌ కన్నంతనం విచిత్రమైన వాదన వినిపించారు. తాము భరించగలిగే వారికే పన్ను వేస్తున్నామని చెప్పారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎవరికైతే కారు, బైక్‌ ఉందో వారే పెట్రోల్‌ కొంటారని జ్ఞానం ప్రసాదించారు. అలాంటి వారు ప్రభుత్వం వేసే పన్నులను కూడా భరించగలుగుతారని చెప్పారు. పెట్రోల్‌ పై వచ్చిన పన్నులతో  పేదల జీవితాలకు మేలు జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ముందుగా అనుకొని పన్ను వేస్తోందని పెట్రోల్ ధరల పెంపును ఆయన సమర్థించారు.