కేంద్రమంత్రితో మంత్రి జగదీశ్ రెడ్డి భేటి

కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్ ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా కూడా మంత్రి వెంట ఉన్నారు. విద్యుత్ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను జగదీశ్ రెడ్డి  కేంద్ర మంత్రికి వివరించారు. కరెంటు కోతలు లేని తెలంగాణను సాధించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అధిగమించిన సవాళ్లు, ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను ఈ సమావేశంలో చర్చించారు. విద్యుత్ రంగంలో రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకారం అందించాలని కొత్తగా బాధ్యతలు తీసుకున్న కేంద్రమంత్రిని మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు కోరారు.