కూలిన ఐదు అంతస్తుల భవనం : 35 మంది మృతి

ముంబైలోని భిండి బజార్ లో ఐదంతస్థుల బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు  వందేళ్ల క్రితం నాటి బిల్డింగ్ కూలడంతో…పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.