కూకట్ పల్లిలో విషాదం

హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. తలసీవనమ్ అపార్ట్ మెంట్ లోని 12వ అంతస్థు నుంచి చిన్నారి కింద పడి మృతి చెందింది. సైకిల్ పై ఆడుకుంటున్న చిన్నారి అపార్ట్ మెంట్ బాల్కానీ పై నుంచి పడిపోయింది.హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.