కుల్గమ్ లో కాల్పులు

జమ్ము కశ్మీర్‌ లో భద్రతా దళాలు మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. కుల్గమ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాద్రులను మట్టుపెట్టాయి. మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  కుల్గమ్‌ జిల్లాలోని కుద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్‌ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు… భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగారు. దీంతో ప్రతిదాడికి దిగిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపేసింది. మృతులు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చెందిన దావూద్‌ అహ్మద్‌ అలీ, షయియార్‌ అహ్మద్‌ వానీగా గుర్తించారు. ఉగ్రవాద శిబిరం నుంచి A.K-47, ఐ.ఎన్‌.ఎస్‌.ఏ.ఎస్‌ తుపాకులను అధికారులు స్వాధీన పరుచుకున్నారు.